Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

  • Dec 02, 2020, 08:30 AM IST

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో ఖాతాను కలిగి ఉంటారు. దీని వల్ల ఉద్యోగులకు పలు ప్రయోజనాలు (Benifits Of EPF Account) చేకూరుతాయి. ప్రతినెలా ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాకు చేరుతుంది. అదే విధంగా సంస్థ సైతం పెన్షన్ స్కీమ్‌తో పాటు పీఎఫ్ ఖాతాకు నగదు జమ చేస్తుంది. నూతన ఇంటి నిర్మాణం, వివాహాలు లాంటి కొన్ని పనులకు పీఎఫ్ నగదును సైతం విత్‌డ్రా చేసుకుకోవచ్చు. అయితే పీఎఫ్ ఖాతాదారులకు అందే బెనిఫిట్స్ వివరాలపై ఓ లుక్కేయండి.

Also read: Liquor sales: మద్యం అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు బ్రేక్

1 /5

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో ఖాతాను కలిగి ఉంటారు. దీని వల్ల ఉద్యోగులకు పలు ప్రయోజనాలు (Benifits Of EPF Account) చేకూరుతాయి. ప్రతినెలా ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాకు చేరుతుంది. అదే విధంగా సంస్థ సైతం పెన్షన్ స్కీమ్‌తో పాటు పీఎఫ్ ఖాతాకు నగదు జమ చేస్తుంది. నూతన ఇంటి నిర్మాణం, వివాహాలు లాంటి కొన్ని పనులకు పీఎఫ్ నగదును సైతం విత్‌డ్రా చేసుకుకోవచ్చు. అయితే పీఎఫ్ ఖాతాదారులకు అందే బెనిఫిట్స్ వివరాలపై ఓ లుక్కేయండి. Also read: Liquor sales: మద్యం అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు బ్రేక్

2 /5

ప్రతి నెలా బేసిక్ శాలరీ నుంచి 12 శాతం, డీఏతో పాటు ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ సైతం 12శాతం నగదును జమ చేస్తుంది. ఇందులో పీఎఫ్ ఖాతాకు జమ అయ్యే నగదు మొత్తానికి EPFO తమ ఖాతాదారులకు వడ్డీ అందిస్తుంది. ప్రస్తుతం 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.50 శాతం వడ్డీ ఇస్తుంది. కేంద్ర కార్మిక శాఖ నిర్ణయాలతో ఈ వడ్డీ రేట్లు మారుతుంటాయని తెలిసిందే. Also Read: ​GHMC Exit Polls 2020: ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయంటే!

3 /5

పీఎఫ్ ఖాతాదారులకు ఉచితంగా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ విధంగా వచ్చే దాన్ని ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) స్కీమ్ అని పిలుస్తారు. పీఎఫ్ ఖాతాదారులకు రూ.6 లక్షల వరకు బీమా లభిస్తుంది. అయితే ఇది ఉద్యోగి జీతాన్ని బట్టి గరిష్టంగా 6 లక్షల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఖాతాదారుడు మరణిస్తే నామినీకి నగదు మొత్తం అందనుంది. Also Read | Indane Gas: ఎక్కడి నుంచి అయినా ఇండేన్ గ్యాస్ రీఫిల్ బుక్ చేయవచ్చు

4 /5

పీఎఫ్ ఖాతాదారులు పదవీ విరమణ చేసిన తర్వాత వీరికి పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయి. EPFO చట్టం ప్రకారం ఉద్యోగుల బేసిక్ శాలరీలో 12 శాతం మరియు డీఏ మొత్తం PF accountకి ప్రతినెలా జమ అవుతుంది. ఉద్యోగి యాజమాన్య కంపెనీ, సంస్థలు 12 శాతం మొత్తాన్ని అందిస్తాయి. ఇందులో 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లోకి వెళ్లగా మిగతా మొత్తం పీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఈపీఎఫ్ఓ నుంచి ప్రతి నెలా పెన్షన్ అందుతుంది.  Also Read : Lower Interest Rates On Home Loans: హోమ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త.. అతి తక్కువ వడ్డీకే రుణాలు

5 /5

ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు పన్నులో కాస్త మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను (Income Tax) చట్టంలోని సెక్షన్ 80 కింద 12 శాతం వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే కొత్త పన్ను విధానం ఎంచుకుంటే మాత్రం ఇది వర్తించదు. Also Read : Motor Vehicle New Rules: వాహనదారులు తెలుసుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే! Also Read | Women Empowerment: మహిళలకు గ్యారంటీ లేకుండా పదిలక్షల రుణం ఇచ్చే బ్యాంకు ఇదే!